కడపలో ఓ విద్యార్థి ఆత్మహత్య కలకలం సృష్టించింది. రిమ్స్ దగ్గరున్న మౌంట్ ఫోర్ట్ స్కూళ్లో 9వ తరగతి చదువుతున్న చరణ్‌రెడ్డి.. పాఠశాలలోని మెట్లకు ఏర్పాటు చేసిన ఇనుప చువ్వలకు యూనిఫాం టైతో ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. స్కూల్ యాజమాన్యం చిన్నారి మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా రిమ్స్ కు తరలించడం అనుమానాలను తావిస్తోంది. మరోవైపు తమకు చెప్పకుండా భౌతికకాయాన్ని తరలించడంపై విద్యార్థి తల్లిదండ్రులు మండిపడ్డారు. స్కూళ్లో ఆందోళన చేశారు. హాస్టల్ వార్డెన్ వేధింపులతోనే కుమారుడు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడని ఆరోపించారు.
Leave a Reply