రూ.500,1000 నోట్లను రద్దు చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణయం భారత్‌తో పాటు విదేశాల్లోనూ సంచలనం సృష్టించింది. ఓవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలతో డాలర్ విలువ గంట గంటకూ మారుతుండగా, మరోవైపు లక్షలాది ప్రవాసీయులకు, వారికుటుంబాలకు షాకిచ్చింది. భారతీయ నల్లధనానికి ప్రధాన మూలంగా ఉన్న బంగారం మొత్తం గల్ఫ్ దేశాల నుంచే వస్తుండగా వారికి కూడా ఈ ప్రకటన పిడుగుపాటుగా మారింది. గల్ఫ్ దేశాలన్నింటిలోనూ మనీ ఎక్సేంజీలు ఉండగా, అందులో స్థానిక కరెన్సీతో పాటు, డాలర్, యూరో, భారతీయ నోట్లను అత్యధికంగా విక్రయిస్తుంటారు. ఆయా కరెన్సీ కట్టలను వారు తమ వద్ద నిల్వ వుంచుకుంటారు. విదేశాల్లో కావాల్సినంత భారత కరెన్సీ లభ్యమవుతుంది. అయితే మోడీ ప్రభుత్వ సంచలన నిర్ణయంతో అక్కడ ఉన్న భారత కరెన్సీ మొత్తం వృధా అయిపోనుంది. అధికారికంగా వీరు మార్చుకునే అవకాశం ఉండదు.
Leave a Reply