నవ్యాంధ్రలో రేషన్ దుకాణాల రూపు మారనుంది. మినీ సూపర్ మార్కెట్లుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పౌర సరఫరాల శాఖ అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ‘అన్న క్యాంటీన్లను’ అందుబాటులోకి తేవాలని సూచించారు. పౌరసరఫరాల శాఖను మరింత బలోపేతం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఉన్నతాధికారులతో జరిపిన సమీక్ష సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. రేషన్‌షాపులను అప్‌గ్రేడ్ చేయడంతోపాటు, రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడంపై దృష్టిపెట్టిన చంద్రబాబు, ఆ దిశగా అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను అతి త్వరలోనే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ముందుగా నగరాలు, పట్టణాల్లో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సామాన్యులకు సైతం నాణ్యమైన ఆహారాన్ని అతి తక్కువ ధరకే పరిశుభ్రమైన వాతావరణంలో అందించేలా చూడాలని స్పష్టం చేశారు. కేబినెట్ సబ్ కమిటీతో చర్చించడంతోపాటు, అక్షయపాత్ర ఫౌండేషన్‌ను సంప్రదించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక రాష్ట్రంలోని అన్ని చౌకధరల దుకాణాలను రిటైల్ కిరాణా దుకాణాలుగా, మినీ సూపర్ మార్కెట్లుగా మార్చాలన్నారు. నిత్యావసర వస్తువులన్నీ ఒకే చోట లభించాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని చెప్పారు. డ్వాక్రా, మెప్మా ఉత్పత్తుల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి కార్పొరేషన్ల సహకారంతో నడిచే సంస్థల ఉత్పత్తులను విక్రయించాలని ముఖ్యమంత్రి సూచించారు. సరుకుల ధరలు రాష్ట్రమంతటా ఒకేలా ఉండాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎస్‌ఈజెడ్‌లలో రిటైల్ కిరాణా దుకాణాలకు గోడౌన్లు నిర్మించనున్నారు. వీటి నిర్వహణను ఏపీ గిడ్డంగుల సంస్థ చేపట్టనుంది. ఇక్కడ్నుంచి నియోజకవర్గంలోని అన్ని దుకాణాలకు ఉత్పత్తులను తరలిస్తారు. డిమాండ్‌కు తగిన విధంగా ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతులు చేసేలా గోడౌన్లు నిర్మించనుంది ప్రభుత్వం.
Latest news
JEE Main Result
NTA నిర్వహించిన మొదటి JEE Main (ప్రధాన పరీక్ష) జనవరి 8 నుండి 12 వ తేదీల మధ్య దేశవ్యాప్తంగా మరియు విదేశాల్లో 258 నగరాల్లో రోజుకు రెండు షిఫ్టులు జరిగాయి. ఈ పరీక్షలో మొత్తం 9, … [Read More...]
JEE Main Notification
NTA 2019 నుండి JEE Main నిర్వహిస్తుంది. ఆన్లైన్ (కంప్యూటర్ ఆధారిత) రీతిలో జాతీయ స్థాయి పరీక్ష సంవత్సరానికి (జనవరి మరియు ఏప్రిల్) రెండుసార్లు నిర్వహించబడుతుంది. గతంలో, ఈ పరీక్షను … [Read More...]

అధికార పార్టీ దెబ్బకు అధికారుల హడల్..
కరీంనగర్‌లో గ్రానైట్ మాఫియా రెచ్చిపోతోంది. సహజ వనరుల్ని కొల్లగొట్టి కోట్లు కూడబెడుతోంది. ప్రభుత్వ ఖజానాకు చిల్లిగవ్వ రాకుండా.. ఒక్క రూపాయి ట్యాక్స్ చెల్లించకుండా... దర్జాగా దందా … [Read More...]

నారా వారి పల్లిలో సంక్రాంతి సందడి..
సంక్రాంతి పండగ కోసం ఏపీ సీఎం స్వగ్రామం నారావారిపల్లె ముస్తాబవుతోంది. నారా, నందమూరి కుటుంబాలు మూడ్రోజులపాటు సొంతూర్లో పండగ జరుపుకోనున్నాయి. ఇప్పటికే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి … [Read More...]

పొత్తులపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు!
హేతుబద్ధత లేకుండా విభజన జరగడం వల్ల ఏపీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయని చంద్రబాబు అన్నారు. విభజన హామీల అమలుపై ప్రధాని మోడీతో సీఎం చర్చించారు. రాజధాని, పోలవరం సహా పలు ప్రాజెక్టులకు … [Read More...]
Leave a Reply