సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు ఇంకా కొలిక్కి రావడం లేదు. హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించడంతో ఈ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. మరి ఈ కేసులో ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లబోతోంది, ఆయేషా మీరా తల్లికి సీఎం ఎలాంటి హామీ ఇచ్చారు, పోలీసులు కేసును ఎలా డీల్ చేస్తారు, సుప్రీం కోర్టుకు వెళతారావెళితే ఎలాంటి వాదనను వినిపిస్తారు పదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య ఇప్పటికీ ఓ సంచలనమే… కేసు విచారణ నుంచి మొత్తం ట్విస్ట్‌ల మీద ట్విస్టులే… ముందు రౌడీషీటర్ లడ్డూ పేరు తెరపైకి వచ్చింది. తర్వాత సత్యంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కాని లాయర్ శ్రీనివాస్ పోరాటంతో… దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ కేసులో హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. సత్యంను నిర్దోషిగా విడుదల చేసింది. ఈ తీర్పుతో ఈ కేసు మళ్లీ మొదటికొచ్చింది. హైకోర్టు తీర్పు తర్వాత ఆయేషా మర్డర్ కేసు పెద్ద మలుపు తిరిగిందనే చెప్పాలి. ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారిని.. సీఎంను కలిశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. నిబద్ధత కలిగిన అధికారులతో కేసును మళ్లీ రీ ఓపెన్ చేయించాలని… ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఆనాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనీ శంషాద్ బేగం అంటున్నారు. తమకు చంద్రబాబు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఆయేషా మీరా హత్య కేసులో మహిళా కమిషన్ కూడా విచారిస్తుందని.. కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. సత్యంబాబును కోర్టు నిర్దోషిగా తేల్చింది కాబట్టి… అసలు దోషులెవరో తేల్చాలన్నారు. హైకోర్టు సత్యంబాబును నిర్ధోషిగా తేల్చటం పోలీసులకు పెద్ద షాక్. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే సత్యంబాబును కోర్టులో హాజరుపరిచారని అంటున్నారు. అయితే ఎక్కడ కథ అడ్డం తిరిగింది? ఇప్పుడు అది తెలుసుకునే పనిలో ఉన్నారు. కోర్టు తీర్పు పేపర్లను క్షుణ్ణంగా చదువుతూ న్యాయమూర్తులు ఎక్కడ లోపాలు ఎత్తి చూపారో పరిశీలిస్తున్నారు. ఆయేషా హత్య కేసులో సత్యంబాబుకు ఎలాంటి సంబంధం లేదని బాధితులు కూడా చెబుతున్నారు. మరి ఈ కేసు భవిష్యత్ ఏంటి? ఈ కేసులో ఇప్పటికైనా ఆయేషా తల్లికి న్యాయం జరుగుతుందా? పోలీసులు అసలు దోషుల్ని పట్టుకోగలరా? సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారా? అసలు ఈ కేసు రీ ఓపెన్ అవుతుందా? ఆయేషా కేసులో పోలీసులు నెక్స్ట్ స్టెప్ ఏంటి?
Latest news

అధికార పార్టీ దెబ్బకు అధికారుల హడల్..
కరీంనగర్‌లో గ్రానైట్ మాఫియా రెచ్చిపోతోంది. సహజ వనరుల్ని కొల్లగొట్టి కోట్లు కూడబెడుతోంది. ప్రభుత్వ ఖజానాకు చిల్లిగవ్వ రాకుండా.. ఒక్క రూపాయి ట్యాక్స్ చెల్లించకుండా... దర్జాగా దందా … [Read More...]

నారా వారి పల్లిలో సంక్రాంతి సందడి..
సంక్రాంతి పండగ కోసం ఏపీ సీఎం స్వగ్రామం నారావారిపల్లె ముస్తాబవుతోంది. నారా, నందమూరి కుటుంబాలు మూడ్రోజులపాటు సొంతూర్లో పండగ జరుపుకోనున్నాయి. ఇప్పటికే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి … [Read More...]

పొత్తులపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు!
హేతుబద్ధత లేకుండా విభజన జరగడం వల్ల ఏపీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయని చంద్రబాబు అన్నారు. విభజన హామీల అమలుపై ప్రధాని మోడీతో సీఎం చర్చించారు. రాజధాని, పోలవరం సహా పలు ప్రాజెక్టులకు … [Read More...]

జీహెచ్‌ఎంసీలో ట్రాన్స్‌పోర్ట్ స్కామ్.. నలుగురి అరెస్ట్
కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేసేశారు కొందరు అవినీతి అధికారులు.. జీహెచ్‌ఎంసీలో ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో వెలుగు చూసిన ఈ స్కామ్ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది.. ఇప్పటికే … [Read More...]

పవన్ అభిమానిపై బాలయ్య అభిమాని దాడి…
హీరోలు తాము అంతా ఒకటే అని ఎన్ని సార్లు చెప్పినా.. అభిమానుల మధ్య వైరం తగ్గడం లేదు.. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అని వివాదాలకు వెళ్ళి.. దాడి చేసుకొనే వరకు వెళ్తున్నారు. కాగా … [Read More...]
About prasanna
I completed Post Graduate Diploma in Journalism in Eenadu Journalism School. I like to write about politics, health and self improvent. You can reach me at prasanna@apnewsdaily.com
Leave a Reply