ఇండో-పాక్ బోర్డర్ మళ్లీ రణరంగంగా మారుతోంది. ఎన్నిసార్లు హెచ్చరించినా బుద్ది మారని పాక్ కాశ్మీర్ సరిహద్దులో మరోసారి తెగబడింది. ఆర్ఎస్ పురా , పరగ్వాల్, కనాచక్ సెక్టార్‌లో భారత సెనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ రెంజర్లు కాల్పులు జరిపారు. పాక్ సైన్యం కాల్పుల్లో BSF జవాన్ మృతి చెందగా ఇద్దరు పౌరులు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన భారత బలగాలు పాక్ దాడిని సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. ఇరు వర్గాల మధ్య అర్ధరాత్రి కాల్పులు కొనసాగుతున్నాయి. పాక్ రేంజర్ల కాల్పులతో సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. సమీప ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
భారత్ సర్జికల్ దాడుల తర్వాత ప్రతీకారేచ్ఛతో రలిగిపోతునన్న పాక్…పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. సరిహద్దులో కాల్పులకు దిగుతోంది. భారత ఆర్మీ క్యాంపులు, స్థానిక ప్రజలే లక్ష్యంగా గుళ్ల వర్షం కురిపిస్తోంది. అటు ఉగ్రవాదులు చొరబాట్లకు యత్నిస్తున్నారు. బార్డర్‌లో అప్రమత్తంగా ఉంటున్న భారత జవాన్లు ఎప్పటికప్పుడు దాయాది దాడులను అడ్డుకుంటున్నాయి. ఇటీవలే ఏడుగురు పాక్ రెంజర్లు సహా కొందరు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది.
Leave a Reply