
అమెరికాను వణికిస్తున్న మరో హరికేన్..

Andhra Pradesh and Telengana State News Daily
AP and TS News at Your Fingertips
డోక్లాం విషయంలో భారత రియాక్షన్‌కు మైండ్ బ్లాంక్ అయిన చైనా.. ఇప్పుడు శాంతి ప్రవచనాలు మొదలుపెట్టింది. పంచశీల సూత్రాలను వల్లెవేస్తోంది. బ్రిక్స్ సమావేశాలకు హాజరైన ప్రధాని మోడీతో ప్రత్యేకంగా సమావేశం అయిన జిన్‌పింగ్.. పంచశీల స్ఫూర్తితో పనిచేద్దామంటూ ప్రతిపాదించడం హాట్ టాపిక్‌గా మారింది. మన బంధాలను సరైన మార్గంలో కొనసాగిద్దామని అన్నారు.
చైనాలోని జియామెన్‌లో బ్రిక్స్ సదస్సు ముగిసింది. ఐదు దేశాల ప్రభుత్వాధినేతలు హాజరైనా.. అందరి దృష్టీ భారత ప్రధాని మోడీ- చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశంపైనే నిలిచింది. డోక్లాం గొడవ తర్వాత జరుగుతున్న ద్వైపాక్షిక భేటీ కావడంతో ప్రపంచమంతా ఆసక్తిగా గమనించింది. సరిహద్దుల్లో శాంతి, సామరస్యం నెలకొన్నప్పుడే రెండు దేశాల మధ్య బలమైన బంధం సాధ్యమని చైనాకు భారత్ గట్టిగా చెప్పింది. డోక్లాం పేరు ప్రస్తావించకుండానే.. గొడవను హైలైట్ చేశారు ప్రధాని మోడీ. పంచశీల స్ఫూర్తితో పనిచేసేందుకు బీజింగ్ సిద్ధమని.. ఢిల్లీ మార్గదర్శకత్వాన్ని కోరేందుకు సిద్ధంగా ఉన్నట్టు జిన్‌పింగ్ చెప్పారు. భారత్-చైనా ప్రపంచశక్తులుగా ఆవిర్భవిస్తున్న పొరుగు దేశాలని, ఇరువురి మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు అవసరమన్నారు. రెండు దేశాల మధ్య బంధం బలోపేతంలో ఈ భేటీ ముందడుగని మన విదేశాంగ శాఖ కార్యదర్శి జైశంకర్ తెలిపారు.
భారత్-చైనా-భూటాన్ సరిహద్దులోని వ్యూహాత్మక ప్రాంతం డోక్లాంలో ఎర్రసైన్యం రోడ్డు వేసేందుకు ప్రయత్నించగా భారత్ జవాన్లు అడ్డుకున్నారు. రెండు నెలలకు పైగా వివాదం నడిచింది. గన్ పేలకుండా, బుల్లెట్ దూసుకెళ్లకుండా చైనీయులు వెనక్కుమళ్లేలా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బ్రిక్స్ వేదికపై టెర్రరిజాన్ని ఖండిస్తూ వెలువడిన తీర్మానంలో పాక్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా, జైషే మహ్మద్, లక్కానీ నెట్‌వర్క్ పేర్లు రావడంలోను దౌత్య విజయం సాధించింది. గతంతో పోల్చితే భారత్ అన్ని రకాలుగానూ బలపడిందని గుర్తించిన జిన్‌పింగ్.. బ్యాక్ టు బేసిక్స్ అన్నారు. పంచశీల స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తించారు.
1954లో భారత్-చైనా మధ్య పంచశీల ఒప్పందం కుదిరింది. దాని అమలుకు చైనా ఏనాడో తిలోదకాలిచ్చింది. భారత్ బలమైన శక్తిగా మారడం.. ప్రపంచదేశాలతో తెలివిగా సంబంధాలు నెరుపుతుండడంతో డ్రాగన్ తోక ముడవాల్సి వస్తోంది. అందుకే.. పంచశీలను మరోసారి తెరపైకి తెచ్చింది. అవకాశాల్ని అందిపుచ్చుకోవాలి కానీ.. ఒకరికొకరు త్రెట్‌గా మారకూడదనే సందేశాన్ని జిన్‌పింగ్ వినిపించడం మామూలు విషయం కాదు. మరి, ఆచరణలో సిన్సియర్‌గా ఉంటారా.. డ్రాగన్ తోక వంకరని నిరూపించుకుంటారా..
బ్రిక్స్ సదస్సులో భారత్ పాక్ ను మరోసారి దోషిగా నిలబెట్టింది. దాయాది దేశంలో ఆశ్రయం పొందుతున్న ఉగ్ర సంస్థల పేర్లు బ్రిక్స్ డిక్లరేషన్ లో చేర్చడంలో విజయం సాధించింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి సదస్సులో మోడీ నేరుగా మాట్లాడకపోయినా.. ఆయన ఈ రోజు చైనా అధ్యక్షుడితో జరిపే చర్చల గురించి మాత్రం ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇద్దరి మధ్యా డోక్లాం అంశం చర్చకు వస్తుందా..ద్వైపాక్షిక చర్చల్లో ఇద్దరూ ఏం చెబుతారనేది ఉత్కంఠ రేపుతోంది.
డోక్లాం ప్రతిష్టంభనకు చెక్ పెట్టి చైనాపై పైచేయి సాధించిన భారత్.. బ్రిక్స్ వేదికగా. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టింది. పాక్ పేరు ప్రస్తావించకుండానే.. ఆ దేశం అండతో రెచ్చిపోతున్న జైషే మహ్మద్, లష్కరే తోయిబా లాంటి పేర్లను బ్రిక్స్ సమావేశాల డిక్లరేషన్ లో చేర్చేలా చేసింది. చైనా జేషే మహ్మద్ చీఫ్ మహ్మద్ సయీద్ ను వెనకేసుకొస్తున్నా ఆ దేశ అధ్యక్షుడి నోటితోనే ఉగ్రవాద సంస్థల హింసను ఖండించేలా చేసింది.
గత ఏడాది గోవా బ్రిక్స్ సమావేశాల్లోనే పాకిస్తాన్ ఉగ్రవాదానికి పుట్టిల్లుగా వర్ణించిన ప్రధాని మోడీ.. ఇప్పుడు చైనా బ్రిక్స్ సమావేశాల్లోనూ పాక్ నిజస్వరూపాన్ని మిగతా దేశాల ముందు పెట్టారు. లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌తో పాటు తాలిబన్, ISIL, అల్ ఖయిదా, హక్కానీ తదితర ఉగ్రవాద సంస్థలు ప్రపంచవ్యాప్తంగా సృష్టిస్తున్న హింసపై బ్రిక్స్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. డిక్లరేషన్ లో పాక్ ఉగ్రవాద సంస్థల పేర్లు చేర్చినా.. సమావేశాల్లో మోడీ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి మాట్లాడకపోవడం చర్చనీయాంశమైంది.
అంతర్జాతీయ సమావేశాల్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై విరుచుకుపడే ప్రధాని మోదీ…బ్రిక్స్ మీట్ ప్లీనరీ సెషన్ లో మాత్రం దాని గురించి మాట్లాడలేదు. పేదరిక నిర్మూలన, ప్రపంచ శాంతి, లింగ సమానత్వం లాంటి అంశాల గురించి ప్రధాని మాట్లాడారు. టెర్రరిజం, టెర్రరిస్టులకు నిధులు సమకూర్చడంపై సంయుక్తంగా పోరాడాలన్న మోడీ.. వారికి నిధులు అందిస్తున్న పాక్ పేరును మాత్రం ప్రస్తావించలేదు.
బ్రిక్స్ సమావేశాల్లో భాగంగా చైనాలో ఉన్న ప్రధాని మోడీ ఇవాళ జిన్ పింగ్ తో ప్రత్యేకంగా సమావేశం కానుండడంపై రెండు దేశాల్లో ఆసక్తి నెలకొంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ఇద్దరు నేతల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కానీ ఇద్దరు నేతల మధ్య గత కొన్ని నెలలుగా కలకలం రేపిన డోక్లాం అంశం చర్చకు వస్తుందా అనేదానిపై మాత్రం రెండు దేశాల అధికారులూ స్పష్టత ఇవ్వలేదు. సమావేశం అనంతరం మోడీ మూడు రోజుల పర్యటన కోసం మనన్మార్ వెళ్తారు.
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరుక్కుని అధ్యక్ష పదవినుంచి వైదొలగబడ్డాడు. మాజీ ప్రధాని బేనజీర్ హత్య విషయంలో కూడా ముషారఫ్‌పై ఆరోపణలు ఉన్నాయి. పాకిస్తాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో గత 2007 డిసెంబర్ 27వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ముషారఫ్ పై ఆరోపణలు ఉన్ననేపథ్యంలో ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ఆ దేశ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు. ఈ కేసు విషయంలో 8 మంది జడ్జీలు మారారు. ఎట్టకేలకు జడ్జి అస్గర్ ఖాన్ తీర్పు చెప్పారు. ఈ కేసులో పర్వేజ్ ముషారఫ్‌తో పాటు రావల్పిండి మాజీ సీపీవో సాద్ అజీజ్, రావల్ టౌన్ ఎస్పీ ఖుర్రమ్ షెహజాద్‌లను న్యాయస్థానం దోషులుగా ప్రకటించింది. మిగిలిన ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులకు 17 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరూ 5 లక్షల రూపాయల జరిమానా విధించింది. వైద్య పరీక్షల పేరుతో గత ఏడాది దుబాయ్‌కు పారిపోయిన ముషారఫ్ ఇంకా స్వదేశం చేరుకోలేదు.
హాంగ్ కాంగ్ హడలెత్తిపోతోంది. హాతో తుఫాన్ ధాటికి విలవిల్లాడుతోంది. 200 కిలోమీర్ల వేగంతో వీస్తున్న గాలులు.. వస్తున్న తుఫాన్‌కు బీభత్సంగా ఉంది. హాంగ్ కాంగ్, మకావ్, దక్షిణ చైనాలో తీవ్ర ప్రభావం చూపిస్తోంది హాతో తోఫాన్. తుఫాన్ ప్రభావంతో 10 మంది పౌరులు చనిపోయారు.
ఎక్కడ చూసినా ఒకటే నీరు. రోడ్ల మీద నీళ్లు.. ఉరకలెత్తుతూ.. ఆకాశ హర్యాలను ముంచేస్తుందా అని దూసుకొస్తున్న సముద్రం… దీనికి తోడు రాకాసిగాలులతో హాంగ్ కాంగ్ కకావికలమవుతోంది. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఏదైనా పని ఉండి.. బయటకు వచ్చిన వారు.. ఈదురుగాలులకు కొట్టుకుపోయే పరిస్థితి వస్తోంది.
తుఫాన్ బీభత్సం మామూలుగా లేదు. రాకాసి గాలులకు ఇళ్ల మీద పై కప్పుడు.. పేపర్లలా ఎగిరిపోతున్నాయి. చెట్లు నేలకూలాయి. కార్లు.. వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి. పోనీ ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోదామన్నా.. వెళ్లే పరిస్థితి లేదు. రోడ్ల మీద వెళ్లే దారి లేదు. విమానాలు కదలడం లేదు. 400కు పైగా సర్వీసులు రద్దయ్యాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతం.. జూద ప్రియుల స్వర్గధామం లాంటి మకావ్‌కు విమాన రాకపోకలు నిలిచిపోయాయి.
గత 20 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి తుఫాన్ చూడలేదంటున్నారు హాంగ్ కాంగ్ వాసులు. ప్రస్తుతం అక్కడి పోర్టుల్లో పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. హాంగ్ కాంగ్‌కి వర్షాలు.. వరదలు మామూలే. ప్రతి ఏటా జూలై నుంచి అక్టోబర్ మధ్యలో తుఫాన్‌లు వస్తుంటాయి. అయితే, ఈ రేంజ్‌లో తుఫాన్ ప్రభావం చూపులేదు. దీంతో హడలిపోతున్నారు ప్రజలు.
దాదాపు శతాబ్దం తరువాత ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. అమెరికాలోని 14రాష్ట్రాల్లో 70కిలోమీటర్ల మేర పట్టపగలే కారుచీకట్లు కమ్మేశాయి. 90నిమిషాల పాటు సూర్య గ్రహణాన్ని అమెరికన్లు ప్రత్యక్షంగా తిలకించారు. ఈ ఖగోళ అద్భుత దృశ్యాలను నాసా ప్రత్యక్ష ప్రసారం చేయడంతో.. లక్షల మంది లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించారు.
అత్యంత అరుదైన సూర్యగ్రహణం అమెరికాలో కనువిందు చేసింది. అమెరికా పశ్చిమ తీరం ఒరేగాన్ నుంచి.. తూర్పు తీరం కరోలినా వరకూ మొత్తం 14 రాష్ట్రాల మీదుగా సూర్యగ్రహణం కొనసాగింది. గ్రహణం పట్టు, విడుపులకు దాదాపు 90 నిమిషాల సమయం పట్టింది. ఇలా ఓ తీరం నుంచి మొదలై.. మరో తీరం వరకూ సుదీర్ఘంగా సూర్యగ్రహణం కనిపించడం.. 99 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి కావడంతో.. అమెరికన్లు ఎంతో ఆసక్తిగా వీక్షించారు. 14 రాష్ట్రాల్లో సంపూర్ణ సూర్య గ్రహణం కనువిందు చేయగా.. ఇతర రాష్ట్రాల్లో పాక్షికంగా కనిపించింది.
అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 9గంటల 5నిమిషాలకు సూర్యగ్రహణం ప్రారంభమైంది. ఒరేగాన్ లో ప్రారంభమైన గ్రహణం దాదాపు గంటన్నరకు పైగా కొనసాగి.. దక్షిణ కరోలినాలో విడిచింది. సూర్యగ్రహణం ఫలితంగా 14 రాష్ట్రాల్లో 70.కి.మీ వెడల్పు ప్రాంతం చీకటిమయం అయింది. గ్రహణ దృశ్యాలను తిలకించేందుకు కరోలినాకు మిలియన్ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అక్కడి హోటళ్లకు పర్యాటకుల తాకిడి పెరిగింది. చార్లెస్టన్ పర్యాటక శాఖ కస్టమర్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అరుదైన సూర్య గ్రహణాన్ని వీక్షిచేందుకు ఉద్యోగులకు కంపెనీలు వెసులు బాటు కల్పించాయి. కొన్ని కంపెనీలు సెలవులు ప్రకటించగా.. మరికొన్ని కంపెనీలు గ్రహణాన్ని వీక్షించేందుకు ఉద్యోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. గ్రహణం సందర్భంగా పలు హోటళ్లలో ప్రత్యేక వంటకాలతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. సూర్యగ్రహణ చిత్రాలు ఉన్న టీషర్ట్‌లు, ప్రత్యేక కళ్లద్దాల అమ్మకాలతో వీధులన్నీ సందడిగా మారాయి.
సూర్యగ్రహణం సందర్భంగా విమాన టికెట్ల ధరలు ఆకాశాన్నంట్టాయి. పలు ఎయిర్‌లైన్ సంస్థలు ప్రయాణికులను విమానాల్లో తీసుకెళ్లి గ్రహణ దృశ్యాలను దగ్గరగా చూపించాయి. ది గ్రేట్ అమెరికన్ ఎక్లిప్స్‌గా పిలుస్తున్న ఈ అరుదైన ఖగోళ అద్భుత దృశ్యాలను నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది.
స్పెయిన్ నెత్తురోడింది. బార్సిలోనాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 13మంది చనిపోయారు. మరో 50మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బార్సిలోనాలోని లాస్ రాంబ్లాస్‌లో పర్యాటకులపైకి వేగంగా వచ్చిన ఓ వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 13 మంది మరణించగా.. 50 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. పాదచారులను ఢీకొన్న తర్వాత దాదాపు అరకిలోమీటరు దూరం వరకు వ్యాన్ దూసుకెళ్లటంతో మృతులు, క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మొదట ప్రమాదంగా దీన్ని భావించినప్పటికీ.. కాసేపటికే ఇది ఉగ్రదాడని బార్సిలోనా పోలీసులు ధ్రువీకరించారు.
కనీసం ఇద్దరు సాయుధులు ఈ ఘటనలో పాల్గొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పర్యాటకులను వ్యాన్‌తో ఢీకొట్టిన ఓ ఉగ్రవాది.. పారిపోయి పక్కనున్న బార్‌లో దాక్కున్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఆకస్మిక ఘటనతో అక్కడి పర్యాటకులు తీవ్ర భయాందోళనలకు గురై పరుగులుతీశారు. లాస్ రాంబ్లాస్‌లో రద్దీ ఎక్కువగా ఉన్నసమయంలోనే వ్యాన్ బీభత్సం సృష్టించింది. ఉగ్రదాడిపై వెంటనే స్పందించిన పోలీసులు ముందుగా క్షతగాత్రులను అంబులెన్సుల్లో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
లాస్ రాంబ్లాస్‌తో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో జనసంచారంపై నిషేధం విధించారు. బార్సిలోనాలో మెట్రోతో పాటు పలు రవాణా మార్గాలను నిలిపివేశారు. మరోవైపు, ఘటనాస్థలానికి సమీపంలోని ఓ డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో కాల్పులు శబ్దం విన్నట్లు స్థానికులు తెలిపారు. బార్సిలోనా శివార్లలోనూ ఇలాంటి దాడికోసం ఉద్దేశించిన రెండో వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో స్పెయిన్ సహా యూరప్ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి.
ఈ ఏడాది లండన్ బ్రిడ్జి వద్ద, ఏడాది క్రితం ఫ్రాన్స్‌లోని నీస్‌లోనూ ఇదే తరహాలో దాడికి ఉగ్రవాదులు ప్రయత్నించారు. బార్సిలోనా ఘటనపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల్లో భారతీయులెవరూ లేరని ఆమె ట్వీట్ చేశారు.