వాట్సప్ వినియోగదారులకు మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. దీంతో ఎలాంటి ఫైల్‌నైనా షేర్ చేసుకునే సదుపాయం వుంటుంది. ఇది అందుబాటులోకి వస్తే ఫొటోలు, వీడియోలు, జిప్ ఫైల్స్ కాకుండా పీడీఎఫ్‌లు, వర్డ్ డాక్యుమెంట్లు, పవర్ పాయింట్ స్లైడ్స్‌ను సైతం షేర్ చేసుకోవచ్చు.
ఫ్రెంచి గయానా నుంచి విజయవంతంగా జీశాట్-17 ప్రయోగం
వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో మరో ఘన విజయం సాధించింది. నెలరోజుల వ్యవధిలోనే మూడు ప్రయోగాలతో సంచలనం సృష్టించింది. ఫ్రెంచ్ గయానా అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-17 విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో.. ఫ్రాన్స్‌కు చెందిన ఏరియన్ స్పేస్- 5 E C A రాకెట్ ద్వారా జీశాట్‌ను ప్రయోగించారు.
మే 5న నింగిలోకి సౌత్ ఏషియా శాటిలైట్
భారత ప్రధాని సార్క్ దేశాలకు అరుదైన బహుమతి అందించనున్నారు, శాస్త్రవేత్తల మేధస్సుతో పొరుగుదేశాల అభివృద్ధికి చేయందించనున్నారు. ప్రధానిగా పదవీ బాధ్యతలు తీసుకున్న కొన్ని వారాల తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలను నరేంద్ర మోడీ అడిగిన సార్క్ శాటిలైట్ కోరిక త్వరలో తీరబోతోంది. మూడేళ్లలో ఇస్రో శాస్త్రవేత్తలు ప్రధాని కోరిక ప్రకారం సార్క్ శాటిలైట్ రూపొందించారు. కానీ పాకిస్తాన్ ప్రాజెక్టు నుంచి వైదొలగడంతో దీనికి సౌత్ ఏషియా శాటిలైట్‌గా నామకరణం చేశారు. మోడీ విదేశాంగ విధానాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లేలా మే 5న దీన్ని ప్రయోగించనున్నారు. సౌత్ ఏషియా శాటిలైట్‌ను 450 కోట్ల వ్యయంతో రూపొందించారు. జీశాట్ 9 అనే ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ ద్వారా దక్షిణ ఆసియాలో భారత్ తనదైన ముద్ర వేయనుంది. టెలీ కమ్యూనికేషన్, బ్రాడ్ కాస్టింగ్ రంగంలో పొరుగుదేశాలకు పూర్తి స్థాయి అప్లికేషన్స్, సేవలు అందించనుంది. మే 5న ఈ శాటిలైట్ ప్రయోగంతో సబ్ కా సాత్, సబ్ కా వికాస్ నినాదం దేశాన్ని దాటి వెళ్లబోతోందని మన్ కీ బాత్ చెప్పారు మోడీ. పాక్ మినహా సౌత్ ఏషియా శాటిలైట్ ప్రాజెక్ట్‌లో భాగమైన నేపాల్, భూటాన్, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, శ్రీలంకకు దీని ద్వారా లబ్ధి చేకూరనుంది. సౌత్ ఏషియా శాటిలైట్ దేశంలో ఆర్థికాభివృద్ధికి ఊతం ఇవ్వడంతోపాటూ పొరుగు దేశాల అభివృద్ధికి కూడా తోడ్పడనుంది. ఈ ఉపగ్రహంలో 12 KU బాండ్ ట్రాన్స్‌పాండర్స్ ఉంటాయి. వీటి ద్వారా పొరుగు దేశాలు తమ కమ్యూనికేషన్ మెరుగుపరుచుకోవచ్చు. కనీసం ఒక ట్రాన్స్‌పాండర్‌ను ఉపయోగించి అవి తమ సొంత ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు.
రష్యా రికార్డును బ్రేక్ చేయబోతున్నభారత్: కక్ష్యలోకి ఒకేసారి 104 ఉపగ్రహాలు
అనుకున్న సమయం రానే వచ్చింది. సైంటిస్టుల పరిశోధనలు విజయవంతమయ్యే రోజు రాబోతుంది. భాతర అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టడానికి రంగం సిద్ధం చేసింది. ఈ అపురూప దృశ్యాన్ని ఈ నెల 15న చూడబోతున్నాం. 1500 కిలోల బరువుండే ఈ ఉపగ్రహాలను 320 టన్నుల పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ సీ37) సౌరకక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. గత ఏడాది జూన్ 22న ఒకే రాకెట్‌లో 20 ఉపగ్రహాలను ప్రయోగించి రికార్డును నెలకొల్పిన భారత్ ఇప్పుడు ఏకంగా 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబోతోంది. 2014లో రష్యా 37 ఉపగ్రహాలను ప్రవేశపెట్టడమే పెద్ద రికార్డు. ఇప్పుడు ఆ రికార్డును భారత్ బ్రేక్ చేయబోతోంది.
ఈ నెల 15న పీఎస్‌ఎల్‌వీ సి-37 ప్రయోగం
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గగనంలో మరో ఘనతను సొంతం చేసుకోబోతోంది. గత దశాబ్ద కాలంలో అనేక ప్రతిష్ఠాత్మక ప్రయోగాలతో దేశ ఖ్యాతిని ఆకాశమంత ఎత్తుకు చేర్చిన షార్ ఇప్పుడు ఏకంగా ప్రపంచానికే సవాల్ విసరబోతోంది. మంగళ్‌యాన్, చంద్రయాన్-1 వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు విజయవంతం చేసిన ఆత్మవిశ్వాసంతో ఈ ఏడు సరికొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు సిద్ధమైంది. ఒకేసారి ఒకే రాకెట్ ద్వారా 108 ఉపగ్రహాలను ప్రయోగించే అరుదైన సవాల్ అందుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఆ సువర్ణ అధ్యాయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) వేదిక కాబోతోంది. ఫిబ్రవరి 15న ఉదయం 9.28గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి37 రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన కార్టోశాట్-2డి ఉపగ్రహం సహా 108 ఉపగ్రహాలు ప్రయోగించనుంది.
ఒకేసారి 103 ఉపగ్రహాలను పంపనున్నఇస్రో

మార్కెట్లోకి పొల్యూషన్ రహిత టాటా మోటర్స్ ‘ఎలక్ట్రిక్ బస్సు’

10లక్షల గూగుల్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి..!

శామ్‌సంగ్ ఫోన్లే కాదు వాషింగ్ మెషీన్‌లు కూడా పేలుతున్నాయి
ఈ మధ్య తరచుగా శామ్‌సంగ్ పోన్లు పేలిపోతున్నాయనే కారణంగా ఆ కంపెనీ వాటిని రీకాల్ చేసింది. ఇప్పుడు వాషింగ్ మెషీన్ కు కూడా పేలుడు ముప్పు వుంటుందంటోంది శాంసంగ్. తాము విడుదల చేసిన టాప్‌లోడ్ వాషింగ్ మెషీన్ మోడల్ ఒక దానిలో లోపం ఉందని కంపెనీ తెలిపింది. ఈ లోపం వల్ల మెషీన్ బ్యాలెన్స్ కోల్పోవచ్చు. అతిగా వైబ్రేట్ కావచ్చు. కొన్ని అరుదైన కేసుల్లో పేలవచ్చని వివరించింది. అందువల్ల వీటి వాలంటరీ రీకాల్‌కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు 28 లక్షలకు పైగా వాషింగ్ మెషీన్లు విక్రయించినట్లు సమాచారం. మెషీన్‌లో ఉద్దేశించిన హైస్పీడ్ సైకిల్ వల్ల డ్రమ్ బ్యాలెన్స్ కోల్పోయి , మెషీన్ విపరీతంగా వైబ్రేట్ అయి మెషీన్ పై భాగం ఊడి విడిపోతుందని పలు ఫిర్యాదులు అందాయి. ఈ వాషింగ్ మెషీన్లు పేలే ప్రమాదం ఉందని తెలిసి కూడా శాంసంగ్ వాటిని విక్రయిస్తుందని ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాలని అమెరికా కోర్టుల్లో కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి.
ఐరోపా అంతరిక్ష సంస్థకు ఎదురు దెబ్బ
మార్స్ ఉపరితలంపైకి ఐరోపా అంతరిక్ష సంస్థ పంపిన స్కాపరెల్లీ ల్యాండర్ పేలిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్స్‌పై దిగడానికి ఉద్దేశించిన రాకెట్లు నిర్ణీత సమయం కన్నా ముందుగానే ఆగిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అంతరిక్షం నుంచి అందిన ఫొటోలను చూసిన శాస్త్రవేత్తలు, ఆ ల్యాండర్‌పై ఆశలు వదులుకున్నారు. ఐరోపా అంతరిక్ష సంస్థకు ఎదురుదెబ్బ తగిలింది. అంగారకుడి ఉపరితలంపైకి ఆ సంస్థ పంపిన స్కాపరెల్లీ ల్యాండర్.. ఆ గ్రహం ఉపరితలాన్ని ఢీకొట్టి, పేలిపోయి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంగారకుడి కక్ష్యలో తిరుగుతున్న అమెరికా ఉపగ్రహం ఎంఆర్‌వో పంపిన ఫొటోలను విశ్లేషించి ఈ మేరకు అంచనా వేస్తున్నారు. స్కాపరెల్లీ ల్యాండర్ నెల 19న ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్ వ్యోమనౌక నుంచి విడిపోయి.. మార్స్ వాతావరణంలోకి ప్రవేశించింది. అయితే మార్స్ ఉపరితలాన్ని తాకడానికి కొన్ని సెకన్ల ముందు ఆ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. తాజాగా అమెరికా ఉపగ్రహంలోని సీటీఎక్స్ కెమెరా.. అంగారకుడి ఉపరితలంపై కొన్ని వస్తువులను గమనించింది. స్కాపెరెల్లీ దిగాల్సిన ప్రదేశంలోనే ఇవి ఉన్నాయి. ఇందులో ఒకటి ఈ ల్యాండర్‌కు సంబంధించిన 12 మీటర్ల పారాచూట్‌గా భావిస్తున్నారు. దీనికి ఉత్తరాన కిలోమీటరు దూరంలో మరో ఆకృతి కనిపించింది. స్కాపెరెల్లీ మాడ్యూల్ ఢీ కొట్టడంవల్ల ఇది ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.స్కాపెరెల్లీ వేగాన్ని తగ్గించి, ఉపరితలంపై సాఫీగా దిగేలా చేయడం కోసం అమర్చిన రాకెట్లు నిర్దేశించిన సమయం కన్నా ముందుగానే ఆగిపోయి ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. ఫలితంగా వ్యోమనౌక గంటకు 300 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగంతో అంగారక ఉపరితలాన్ని ఢీ కొట్టి ఉంటుందని.. ఈ క్రమంలో ఇంధన ట్యాంకులు పేలిపోయి ఉంటాయని భావిస్తున్నారు.