విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇప్పుడున్న VUDA (Visakhapatnam Urban Development Authority )కాస్తా VMRDA (Visakhapatnam Metro region Urban Development Authority) గా మారనుంది. విశాఖను ముంబై, హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. VMRDA పరిధిలోకి విశాఖ జిల్లాతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు రానున్నాయి. 50 మండలాలు, 1453 గ్రామాలు, 7086 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో 60 లక్షల 53 వేల మంది VMRDAలో నివసించనున్నారు. ఈ సంస్థకు ముఖ్యమంత్రి చంద్రబాబు చైర్మన్ గా వ్యవహరించే అవకాశాలున్నాయి.
Leave a Reply