అమెరికాలోని షికాగో విమానాశ్రయంలో విమాన ప్రమాదం జరిగింది. షికాగో నుంచి మియామీ బయలుదేరిన అమెరికా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 20మంది ప్రయాణీకులు గాయపడ్డారు. మంటలు, దట్టమైన పొగకారణంగా ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఎమర్జెన్సీ స్లైడ్ లద్వారా కిందకు దిగడంతో…..ఎక్కువమంది గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. ప్రయాణీకులు కిందకు దిగిన కొద్దిసేపటికే విమానంలో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. 767 మంది ప్రయాణీకులున్న ఈ విమానం టేకాప్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంజన్ కు సంబంధించిన సమస్యవల్లే మంటలు వ్యాపించి ఉంటాయని అమెరికన్ ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు.
Leave a Reply