భోపాల్‌లో సిమీ ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరయ్యారు. పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఉగ్రవాదులు తప్పించుకున్నా… పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారని సీఎం అన్నారు. మరోవైపు భోపాల్ ఎన్‌కౌంటర్‌పై రచ్చ కొనసాగుతోంది. ఇది ముమ్మాటికీ బూటకమని ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ముమ్మాటికీ ఎదురుకాల్పులేనని చెబుతోంది. పారిపోయిన ఉగ్రవాదుల దగ్గర ఆయుధాలు ఉన్నాయనీ.. వారు పోలీసులపై కాల్పులు దిగారంటున్నారు. అందుకే తప్పని పరిస్థితుల్లో పోలీసులూ కాల్పులు జరిపారని చెప్పారు. వారి దగ్గర నాలుగు నాటు తుపాకులు, పదునైన ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఎన్‌కౌంటర్‌పై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌చౌహాన్ స్పందించారు. పరారీ ఘటనపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తుందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేపడుతుందన్నారు. ఈ మొత్తం ఘటనను తీవ్రంగా తీసుకున్నామనీ… రిటైర్డ్ డీజీపీతో దర్యాప్తు జరిపించి, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. గత మూడేళ్లలో సిమి కార్యకర్తలు జైలు నుంచి పారిపోయిన ఘటనల్లో ఇది మూడోది. 2013లో మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి ఏడుగురు తప్పించుకొన్నారు. వారిలో నలుగురు మూడేళ్ల తర్వాత అరెస్టయ్యారు. పరారీలో ఉన్నప్పుడు బ్యాంకు దోపిడీకి పాల్పడ్డారు. భోపాల్ జైలు నుంచి సిమి ఉగ్రవాదుల పరారీతో… జైళ్లలో భద్రతా లోపాలు బయటపడుతున్నాయి. దేశంలో సగటున రోజుకో ఖైదీ తప్పించుకుంటున్నారు. విచారణ ఖైదీల సంఖ్య ఎక్కువగా ఉండడంతో జైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి.
Leave a Reply