పెద్ద నోట్ల రద్దుపై అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ జనవరి 6 నుంచి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చుట్టబోతోంది. మరోవైపు నోట్ల రద్దు పెద్ద స్కాం అంటున్న కాంగ్రెస్ ఆరోపణలు నిరాధారమని కేంద్రమంత్రి వెంకయ్య తిప్పికొట్టారు.
పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులకు బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. పేదలు, కార్మికులు, చిరు వ్యాపారులు కష్టాలు వర్ణనాతీతతమని, మోడీ అనాలోచిత నిర్ణయాలతోనే ఈ పరిస్థితి దాపురించిందని కాంగ్రెస్ దుమ్మెత్తి పోస్తోంది. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా వచ్చే నెల 6వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత నెలకొన్న పరిస్థితులు మెరుగుపడేందుకు ప్రధాని మోడీ అడిగిన 50 రోజుల గడువు ముగిసినా పరిస్థితి మారే అవకాశం కనిపించడం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా విమర్శించారు.
Leave a Reply