ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద వేల సంఖ్యలో కేంద్ర భద్రతా బలగాలు మోహరించాయి. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే దాదాపు 20వేల భద్రతా సిబ్బంది విధులు నిర్వరిస్తున్నారు. యూపీలోని 75 జిల్లాల్లో 78 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఉత్తరాఖండ్‌లో 15 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పంజాబ్‌లో 27 ప్రాంతాల్లోని 54 కేంద్రాలు, గోవాలో రెండు కేంద్రాల్లో కౌంటింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లోకి ఎటువంటి మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదని ఎన్నికల కమిషన్ కఠినమైన ఆదేశాలను జారీ చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని భద్రతా అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపు జరిగే గదుల్లో కేంద్ర భద్రతా బలగాలు మాత్రమే ఉంటారని, వెలుపల స్థానిక పోలీసులు ఉండనున్నట్లు ఈసీ వెల్లడించింది. గుర్తు తెలియని, ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను ఓట్ల లెక్కింపు జరిగే ప్రదేశాల వద్దకు అనుమతించవద్దని తెలిపింది. ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాలకు సుమారు 100మీటర్ల దూరం వరకు వాహనాలు, పాదచారులను అనుమతించడానికి వీల్లేదు. స్ట్రాంగ్ రూమ్స్ నుంచి ఈవీఎంలను తీసుకొచ్చే ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చారు.
Latest news

అధికార పార్టీ దెబ్బకు అధికారుల హడల్..
కరీంనగర్‌లో గ్రానైట్ మాఫియా రెచ్చిపోతోంది. సహజ వనరుల్ని కొల్లగొట్టి కోట్లు కూడబెడుతోంది. ప్రభుత్వ ఖజానాకు చిల్లిగవ్వ రాకుండా.. ఒక్క రూపాయి ట్యాక్స్ చెల్లించకుండా... దర్జాగా దందా … [Read More...]

నారా వారి పల్లిలో సంక్రాంతి సందడి..
సంక్రాంతి పండగ కోసం ఏపీ సీఎం స్వగ్రామం నారావారిపల్లె ముస్తాబవుతోంది. నారా, నందమూరి కుటుంబాలు మూడ్రోజులపాటు సొంతూర్లో పండగ జరుపుకోనున్నాయి. ఇప్పటికే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి … [Read More...]

పొత్తులపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు!
హేతుబద్ధత లేకుండా విభజన జరగడం వల్ల ఏపీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయని చంద్రబాబు అన్నారు. విభజన హామీల అమలుపై ప్రధాని మోడీతో సీఎం చర్చించారు. రాజధాని, పోలవరం సహా పలు ప్రాజెక్టులకు … [Read More...]

జీహెచ్‌ఎంసీలో ట్రాన్స్‌పోర్ట్ స్కామ్.. నలుగురి అరెస్ట్
కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేసేశారు కొందరు అవినీతి అధికారులు.. జీహెచ్‌ఎంసీలో ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో వెలుగు చూసిన ఈ స్కామ్ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది.. ఇప్పటికే … [Read More...]

పవన్ అభిమానిపై బాలయ్య అభిమాని దాడి…
హీరోలు తాము అంతా ఒకటే అని ఎన్ని సార్లు చెప్పినా.. అభిమానుల మధ్య వైరం తగ్గడం లేదు.. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అని వివాదాలకు వెళ్ళి.. దాడి చేసుకొనే వరకు వెళ్తున్నారు. కాగా … [Read More...]
About Bhagya
I write about Telugu Cinema and Entertainment News. I was a freelance contributor for Cinema Column for eenadu.net. You can reach her at bhagya@apnewsdaily.com
Leave a Reply