దేశంలో అవినీతి రహిత పాలన అందిస్తున్న ఘనత మోడీ ప్రభుత్వానికి దక్కుతుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. నోట్ల రద్దు కారణంగా నష్టపోయిన బ్లాక్ మనీ రాయుళ్లు మాత్రమే ఇబ్బందులు పడుతున్నారని.. వారే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆయన ఢిల్లీలో అన్నారు. దేశంలో ప్రస్తుతం నిశ్శబ్ద విప్లవం వస్తుందన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థ కీలక మార్పు దిశగా అడుగులు వేస్తుందన్నారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం రబీ సాగు విస్తీర్ణం పెరిగిందని.. జాతీయోత్పత్తి కూడా పెరుగుతుందన్నారు. నోట్ల రద్దు వల్ల ప్రజల కష్టాలు తగ్గాయన్నారు.
Leave a Reply