అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఆధ్వర్యంలో నడుస్తున్న ట్రంప్ ఫౌండనేషన్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్.. తన ఫౌండనేషన్ పై వివాదాలు తలెత్తకుండా ఉండేందుకే రద్దు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. దశాబ్దాలుగా తన ఫౌండేషన్ డబ్బులు.. నూటికి నూరుశాతం సేవ కోసమే వెచ్చిస్తున్నామని ట్రంప్ చెప్పారు. అయితే ఇటీవల ఈ ఫౌండేషన్ ఎన్నికల్లో ట్రంప్‌కు అనుకూలంగా ప్రచారం చేసేందుకు నిధులు ఖర్చు చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. వీటిపై ఆరోపణలపై న్యూయార్క్ ఏజీ కార్యాలయం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తన ఫౌండేషన్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
Leave a Reply