రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. టోంక్ లో ఆయన ఒక సభలో పాల్గొన్నారు. ఆయన ప్రసంగిస్తుండగా వేదికపైకి పెద్ద సంఖ్యలో జనం చేరారు. దీంతో అధిక బరువుకు వేదిక కుప్పకూలిపోయింది. అశోక్ గెహ్లాట్ తో పాటు పలువురు కింద పడిపోయారు. గెహ్లాట్ తో పాటు పలువురికి స్వల్ప గాయాలయ్యాయని నిర్వాహకులు చెప్పారు. ఎవరికీ పెద్దగా ప్రమాదం లేదని తెలిపారు.
Leave a Reply