నోట్ల రద్దుతో బ్యాంకుల్లో పని ఒత్తిడి పెరిగింది. అన్ని చోట్లా సిబ్బంది నిర్విరామంగా పని చేస్తున్నారు. కొత్త కరెన్సీని అందరికీ అందించడంలో బిజీగా ఉంటున్నారు. ఇలాంటి రంగాల్లో సేవలందించేందుకు కోయంబత్తూర్‌కు చెందిన ఓ సంస్థ సరికొత్త హ్యూమనాయిడ్ రోబోను రూపొందించింది. బ్యాంకింగ్ సెక్టార్‌లో ఈ రోబో విశేష సేవలందిస్తుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. బ్యాంకుకు వచ్చిన వారికి అకౌంట్ ఓపెనింగ్ సహా పలు కీలక అంశాలపై సమాచారం అందించేలా ఈ హ్యూమనాయిడ్ రోబోను రూపొందించారు.
Leave a Reply