ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో సతీ సమేతంగా భారత్‌లో పర్యటించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయిన ప్రధాని మోడీతో కలిసి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య మూడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోకు ఘన స్వాగతం లభించింది. భార్యతో కలిసి వచ్చిన విడోడోకు రాష్ట్రపతి భవన్ దగ్గర ప్రధాని మోడీ ఎదురెళ్లి ఆహ్వానించారు. అనంతరం విడోడో రాష్ట్రపతిని కలిశారు. 2014లో అధ్యక్షుడుగా ఎన్నికైన విడోడో భారత్‌కు రావడం ఇదే మొదటి సారి. విడోడోతోపాటూ సీనియర్ అధికారులు, 22 మంది వ్యాపారవేత్తలు భారత్ వచ్చారు. రాజ్ ఘాట్ దగ్గర మహాత్ముడి సమాధికి నివాళి అర్పించారు. అనంతరం ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్న విడోడో.. పలు కీలక అంశాలపై ఆయనతో చర్చించారు. ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి ప్రధాని మోడీ సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇండోనేషియా భారత్‌కు మిత్ర దేశమన్నారు.
భారత్ ఇండోనేషియా మధ్య మూడు కీలక ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాలపై రెండు దేశాల మంత్రులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఇండోనేషియా భారత్‌కు ముఖ్యమైన వాణిజ్య భాగస్వామిగా పేర్కొన్నారు మోడీ. భారత్-ఇండోనేషియాలు అభివృద్ధిలో పరస్పరం సహకరించుకోవాలని ఆకాంక్షించారు.
Leave a Reply