విజయవాడలో ఒక యువతిని నమ్మించి మోసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు చితకబాదారు. దెబ్బలకు తాళలేక పడిపోయేంతగా కొట్టి ఆస్పత్రి పాలు చేశారు. నగరంలో ఒక మూగ యువతిని లోబర్చుకుని గర్భవతిని చేసిన ఓ యువకుడిని పోలీసులు విచారణ కోసం స్టేషన్‌కు తీసుకెళ్లారు. కానీ విచారణలో భాగంగా అతడిని తీవ్రంగా కొట్టారు. పోలీసు దెబ్బలు తాళలేకపోయిన యువకుడు స్టేషన్‌లో పడిపోయాడు. దీంతో పోలీసులు అతడిని చికిత్స కోసం ఒక ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం నిందితుడికి ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు.
Leave a Reply