విశాఖ గాజువాక లో గిరిజన మూగ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. అంతేకాదు బాలిక శీలానికి లక్షా 50 వేల రూపాయలు వెల కూడా కట్టారు. దువ్వాడలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.. దువ్వాడలోని ఓ కంపెనీలో గిరిజన మూగ బాలిక పని చేస్తోంది. మొక్కలకు నీరుపోస్తున్న ఆమెపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ కన్నేసాడు. బాలికను బస్సులోకి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఇంటికి వెళ్లిన ఆమె తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్తుంటే… తల్లిదండ్రులు ఏం జరిగిందని ప్రశ్నించారు. తనపై జరిగిన అకృత్యాన్ని ఆమె సైగలతో తెలిపింది. కూతురుపై జరిగిన అత్యాచారాన్ని బాధితురాలి తల్లిదండ్రులు ట్రావెల్స్ యజమాని దృష్టికి తీసుకెళ్లారు. ఆయన బాలిక శీలానికి వెల కట్టాడు. లక్ష 50 వేల రూపాయలు తీసుకొని వెళ్లాలని బాధితురాలి తల్లిదండ్రులను బెదిరించాడు.. మరోవైపు దువ్వాడలో జరిగిన అత్యాచారంపై పోలీస్ కమిషనర్ సీరియస్ అయ్యారు. దీంతో ఏసీపీ రామ్మోహన్ కుమార్ రంగంలోకి దిగారు. పోలీసులు నిందితుడు విశ్వనాథంను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Leave a Reply