పెద్దనోట్ల రద్దుతో ఉత్పన్నమైన పరిస్థితి దృష్ట్యా రైతుల వద్ద లావాదేవీలు కష్టమవుతున్నాయి. వినియోగదారుల వద్ద కూడా వందనోట్లు లేక పోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. ఆంధ్రాబ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులు మైక్రో ఏటిఎంలను పెట్టి రైతులకు, వినియోగదారులకు రూ.100 నోట్లను సర్దుబాటు చేస్తున్నారు. భవిష్యత్తులో నగదు రహిత లావాదేవీలను నిర్వహించాలన్న లక్ష్యంతో రైతులందరూ మొబైల్ యాప్ ద్వారా నగదు లావాదేవీలను నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రయత్నాల్లో ఆంధ్రాబ్యాంక్ కీలక పాత్ర పోషిస్తోంది. సాధారణ ఫోన్లు ఉన్నా యాప్‌ను వినియోగించుకునే సదుపాయం ఉన్నట్లు వీరు చెబుతున్నారు. ఇందుకు గాను ఒకటి రెండు రోజుల్లో రైతులకు దరఖాస్తులు అందచేయనున్నారు.
Leave a Reply