నగ్రోటాలో జరిగిన ఉగ్రదాడికి జైషే మహమ్మదే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అఫ్జల్ గురు మృతికి ప్రతీకారంగా ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ హస్తం ఈ దాడులకు పాల్పడినట్లు సంఘటనా స్థలం వద్ద లభించిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఉగ్రవాదులు సొరంగమార్గం ద్వారా భారత భూభాగంలోకి ప్రవేశించినట్లు అధికారులు అనుమావిస్తున్నారు. ఉగ్రదాడి జరిగిన సంఘటనా స్థలం వద్ద జేషే మహ్మద్‌కు చెందిన అఫ్జల్ గురు స్వ్కాడ్ పేరిట ఉర్దూలో రాసి ఉన్న నోట్ లభించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. సైనిక స్థావరాలపై దాడి చేసిన ఉగ్రవాదులు సొరంగ మార్గం ద్వారా జమ్ము కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లోకి చొరబడ్డట్లు అనుమానిస్తున్నారు.
ఉగ్రదాడి జరిగిన సంఘటనా స్థలం నుంచి మూడు ఏకే 47 రైఫిళ్లు, మ్యాగజైన్లు, గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. అఫ్జల్ గురు మృతికి ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు సంఘటనా స్థలం వద్ద ఉగ్రవాదులు ఒక నోట్‌ను వదిలివెళ్లారు. అఫ్జల్ గురు పేరిట జైషే మహ్మద్ గత ఏడాది ఒక స్క్వాడ్‌ను ఏర్పాటు చేసింది. ఉగ్ర దాడితో సైన్యం కూంబింగ్ ఆపరేషన్‌ను మరింత కట్టుదిట్టం చేసింది. ఉగ్రవాదులు పోలీసు దుస్తుల్లో వచ్చి సైనిక స్థావరంపై దాడి చేయడంతో సైనిక శిబిరాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యురీ ఘటన తర్వాత అత్యంత సురక్షితమైన ఏర్పాట్లు చేసినా.. వాటిని తప్పించుకుని ఉగ్రవాదులు ఎలా లోపలికి చొరబడ్డారనేదానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అటు ఉగ్రదాడి జరిగిన నగ్రోటాను సందర్శించిన భారత ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్.. దాడి సంఘటనా క్రమాన్ని అడిగి తెలుసుకున్నారు.
Leave a Reply