మధ్య ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలో పడిన దుర్ఘటనలో17మందికి పైగా మరణించారు. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులున్నారు. రత్లాం నుంచి మంద్ సోర్ వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. స్థానికులు వెంటనే ప్రయాణికులను కాపాడటానికి ప్రయత్నాలను మొదలుపెట్టారు. అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు, ఇతర అధికారులు రంగంలోకి దిగారు. ప్రయాణికులను కాపాడటానికి సహాయక చర్యలు చేపట్టారు.
Leave a Reply