ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి సైనికులతో కలిసి జరుపుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నూర్ జిల్లాలోని ఐటీబీపీ జవాన్లను ఆయన కలిశారు. సైనిక సిబ్బంది ప్రధానికి ఆత్మీయ స్వాగతం పలికారు. సైనికులకు ఆత్మీయంగా మిఠాయిలు తినిపించారు. జవాన్లతో కలిసి దిగిన కొన్ని ఫొటోలను ప్రధాని మోడీ జై జవాన్.. జై హింద్.. అంటూ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. గత రెండేళ్లుగా మోడీ సైనికులతో కలిసి దీపావళి జరపుకొంటున్నారు.
Leave a Reply