భారత ప్రధాని మోడీ కొత్త సంవత్సరం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటించి.. 50 రోజులు గడువు విధించిన ప్రధాని ఆ తర్వాత రోజే అంటే డిసెంబర్ 31న సాయంత్రం ఏడున్నరకు స్పీచ్ ఇవ్వనున్నారు. నల్లధనం కట్టడికి కేంద్రం తీసుకున్న నిర్ణయాలు విజయవంతమైనట్లు ప్రధాని తన ప్రసంగంలో ప్రకటించే అవకాశం ఉంది. డీమోనిటైజేషన్ తర్వాత మరికొన్ని కఠిన చర్యలు తీసుకోనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన మోడీ.. ఈసారీ ఏం చెబుతారోననే ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది.
Leave a Reply