ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. అధికార సమాజ్ వాదీ పార్టీలో లుకలుకలు పెరుగుతున్నాయి. ములాయం సింగ్ యాదవ్ కుటుంబ పోరు తీవ్రమవుతోంది. ములాయం తమ్ముడు శివపాల్ యాదవ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి హోదాలో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయడంపై చర్చించాలనేది ఆయన ఉద్దేశం. ఈ భేటీకి పలువురు మంత్రులు, నాయకులు హాజరయ్యారు. అయితే ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాత్రం డుమ్మా కొట్టారు. అఖిలేష్ విడిగా మరో మీటింగ్ పెట్టాలని నిర్ణయించారు. దీంతో బాబాయ్, అబ్బాయ్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.
Leave a Reply