జయలలిత నెచ్చెలి శశికళ ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని దక్కించుకునేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. జయలలిత ప్రాతినిధ్యం వహించిన చెన్నై ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందాలని కూడా ఆమె భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శశికళతో సుమారు రెండు గంటలపాటు మంతనాలు జరిపారు. పోయెస్‌గార్డెన్ శశికళ బంగ్లాగా మారిపోయింది. దీనితో పార్టీనే కాదు ప్రభుత్వం కూడా శశికళ కనుసన్నల్లోనే నడుస్తున్న వాస్తవాన్ని పోయెస్ గార్డెన్ కు రావడం ద్వారా పన్నీర్ సెల్వం ధ్రువీకరించారు. శశికళ జయంతి భవంతిని తనదిగా చేసుకోవడమే కాకుండా బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి అమ్మ పేరుని నిలబెట్టేలా చూడాలని తమిళులు కోరుకుంటున్నారు.
Leave a Reply