ఇవాళ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయ్. నిఫ్టీ గత రికార్డు స్థాయిని అధిగమించడంతో పాటు 10 వేల 231 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 10 వేల 249 పాయింట్లకు ఎగసిన నిఫ్టీ ఎక్కడా తన జోరు తగ్గించలేదు. సెన్సెక్స్ కూడా 200 పాయింట్లు లాభపడి 32 వేల 633 పాయింట్ల వద్ద క్లోజైంది. సెన్సెక్స్ గత గరిష్టస్థాయి అయిన 32 వేల 686 పాయింట్లను ఇంట్రాడేలో అధిగమించింది! మొత్తం మీద గత రెండు సెషన్లుగా లాభాల్లో ముగియడంతో దలాల్ స్ట్రీట్‌లో ఎర్లీ దీవాలీ జోష్ కన్పిస్తోంది.
Leave a Reply