ఇప్పటికే భారత సైన్యం ఇచ్చిన సర్జికల్ స్ట్రైక్ షాక్ తో దిమ్మతిరిగిపోయిన నవాజ్ కు పాక్ సుప్రీం కోర్టు కూడా షాకిచ్చింది. షరీఫ్ కుటుంబం అవినీతికి పాల్పడిందని, విదేశాల్లో ఆస్తులు పోగేసుకుంటుందని ఆయన ప్రధానిగా అనర్హుడని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనికి కోర్టు స్పందించి షరీప్ కు నోటీసులు జారీ చేసింది. పనామా పేపర్ లీక్స్ ను ఆధారంగా చేసుకుని ఈ పిటీషన్ దాఖలైంది. షరీఫ్ మీద ఆరోపణలు చేసిన వారిలో ప్రముఖ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కూడా ఉన్నారు. అక్రమంగా సంపాదించిన సొమ్మును విదేశాలకు తరలిస్తున్నారన్న ఆరోపణలు ఆయనతో పాటు ఆయన కుమార్తె, కుమారులు, అల్లుడు ఆర్థిక మంత్రితో పాటు పలువురు ముఖ్య అధికారుల మీద కూడా ఆరోపణలు రావడంతో వారందరికీ సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. పాక్ అత్యున్నత న్యాయస్థానం దేశ ప్రధానికే నోటీసులు ఇవ్వటం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారింది.
Leave a Reply