ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లో మళ్లీ రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ముఖ్యమంత్రి పెమా ఖండూతో సహా ఆరుగురు ఎమ్మెల్యేలను అరుణాచల్ పీపుల్స్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అభియోగంతో వారిపై వేటు వేశారు. ఇక మీదట పెమా ఖండూ లెజిస్టేచర్ పార్టీ నాయకుడు కాదని పార్టీ ప్రకటించింది. త్వరలోనే కొత్త నేతను ఎన్నుకుంటామని తెలిపింది. దీంతో పెమా ఖండూ ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడం అనివార్యంగా కనిపిస్తోంది.
Leave a Reply