జయలలిత మరణానంతరం తమిళరాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. అదేసమయంలో రాజకీయ శూన్యత కూడా కనిపిస్తోంది. అన్నాడీఎంకేలో అంతర్గత కుమ్ములాటలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ సోదరుడు సత్యన్నారాయణ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయమని, ఆయన అభిమానుల కోరిక నెరవేరడానికి కూడా ఇదే మంచి తరుణమని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే అంశంపై మీడియాతో మాట్లాడుతూ రజనీ తాజా చిత్రం వచ్చే ఏడాది పూర్తవుతుందని, అప్పటి వరకు తమిళనాట రాజకీయ పరిస్థితులను గమనిస్తుంటారని, ఆ తరువాత ఏదైనా జరగవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వస్తే కొత్త పార్టీ స్థాపిస్తారని తేల్చి చెప్పారు.
Leave a Reply