బ్యాంకులకు 9వేల కోట్లకు పైగా సొమ్మును బకాయిపడి లండన్ పరారైన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యింది. రాహుల్ గాంధీ ట్విట్టర్‌ను హ్యాక్ చేసిన వ్యక్తులే ఈ పనికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా తన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయినట్లు ఒక ట్వీట్‌లో మాల్యా ధ్రువీకరించారు. నా ఇ-మెయిల్ అకౌంట్లను హ్యాక్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు అని మాల్యా పేర్కొన్నారు. హాకర్లు మాల్యాకు చెందిన వివిధ బ్యాంకుల్లో ఉన్న ఆస్తులు, అకౌంట్ల పాస్‌వర్డ్‌లు పలు ట్వీట్లలో పోస్టు చేస్తున్నారు.
Leave a Reply