నేషనల్ కబడ్డీ ప్లేయర్ భార్య లలిత ఆత్మహత్య చేసుకుంది. కట్నం కోసం రోహిత్ కుటుంబం తనను వేధిస్తుందని, రోహిత్ కూడా తనను విడిచి వెళ్ళాలని అన్నాడని సూసైడ్ నోట్ లో పేర్కొంది. ప్రో కబడ్డీలో బెంగుళూరు బుల్ టీమ్ కు ప్రాతినిధ్యం వహించే రోహిత్ మార్చిలో లలితను పెళ్ళి చేసుకున్నాడు. లలిత ఆత్మహత్య చేసుకున్న సమయంలో రోహిత్ ముంబైలో ఉన్నాడు. 2009 లో నేవీ లో చేరాడు రోహిత్. అప్పటి నుంచి ముంబైలో ఉంటున్నాడు. లలితకు ఇది రెండో పెళ్ళి. మొదటి భర్త కూడా కట్నం కోసం వేధించడంతో ఆమె విడాకులు తీసుకుంది. ఇప్పుడు కూడా అవే వేధింపులు ఎదురు కావడంతో ఆమె పూర్తిగా డిప్రెషన్ కు గురైంది. రోహిత్ సంతోషం కోసమే తానే నిర్ణయం తీసుకున్నానని సూసైడ్ నోట్ లో పేర్కొంది.
Leave a Reply