మనిషి ప్రకృతిని సవాల్ చేస్తూ.. ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తున్నాడు. ముఖ్యంగా వైద్యంలో అద్భుతాలు చేస్తున్నాడు. ఇప్పటికే శరీరంలోని అవయవాల మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహిస్తున్న వైద్యులు తాజాగా ఇద్దరు వ్యక్తుల తలలను కూడా విజయవంతంగా మార్పిడి చేశారు. ఇటలీకి చెందిన సర్జన్ సెర్గీ కనవేరో ఆధ్వర్యంలో ఇద్దరు మరణించిన వ్యక్తుల తలలను విజయవంతగా మార్పిడి చేశారు. ఈ ఆపరేషన్ 18 గంటలపాటు జరిగింది. మొదట రెండు మృతదేహాల నుంచి తలలను విడదీసి వైద్యులు ఒకరి తలను మరొకరికి అమర్చారు. అలా తలను అమర్చే సమయంలో నాడీ, రక్త కణ జలాలను తిరిగి తలకు అనుసంధానం చేశారు. ఈ ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ కనవేరో ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రపంచంలో మొదటి మానవ తల ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ ఇదే అని చెప్పారు. భవిష్యత్ లో ప్రాణం ఉన్న వ్యక్తులకు కూడా ఈ సర్జరీని విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పగా… కొంత మంది శాస్త్రవేత్తలు.. ప్రాణం ఉన్న మనుషులపై ఇటువంటి సర్జరీలు చేస్తే.. ఆ ఫలితం.. మరణానికి మించి ఉంటుంది అని హెచ్చరిస్తున్నారు. ఇక భవిష్యత్ లో మరణాన్ని జయించి సృష్టికి ప్రతి సృష్టి చేసే విధంగా ప్రయత్నాలు చేస్తామని ఇప్పటికే కొంత మంది శాస్త్రజ్ఞులు ప్రకటించిన సంగతి విధితమే..
Leave a Reply