12 జనవరి: జాతీయ యువజన దినోత్సవం
స్వామి వివేకానంద జన్మదినమైన జనవరి 12ను జాతీయ యువజన దినోత్సవంగా దేశవ్యాప్తంగా నిర్వహించారు. భారత ప్రభుత్వం 1985 నుంచి ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నది. 2020 సంవత్సర జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద యొక్క 157వ జయంతి ఉత్సవాలను జరుపుకొన్నారు.
యువతలో దాగున్న నిగూఢశక్తిని వెలికితీయుటకు వివేకానందుడి రచనలు, ఆలోచనల దృక్పథం మరియు విలువలను అందరికీ తెలియజేయడం ఈ దినోత్సవ నిర్వహణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం
యువతకు స్ఫూర్తి.. స్వామి వివేకానంద సూక్తులు
విజయం వరించిందని విర్రవీగకు, ఓటమి ఎదురైందని నిరాశచెందకు. విజయమే అంతిమము కాదు, ఓటమి తుది మెట్టు కాదు. – స్వామి వివేకానంద.
లేవండి! మేల్కోండి! గమ్యం చేరేవరకు విశ్రమించంకండి. – స్వామి వివేకానంద.
హృదయానికి, మెదడుకు మధ్య సంఘర్షణ తలెత్తితే… హృదయాన్నే అనుసరించండి. – స్వామి వివేకానంద.
రోజుకు ఒక్క సరైన మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని మీరు కోల్పోతారు. – స్వామి వివేకానంద.
మీకు సాయం చేస్తున్న వారిని మరువకండి. మిమ్మల్ని ప్రేమిస్తున్న వారిని ద్వేషించకండి. మిమ్మల్ని నమ్ముతున్నవారిని మోసం చేయకండి. – స్వామి వివేకానంద.
ఎవరి కోసమో దేని కోసమో ఎదురు చూడకండి. మీరు చేయగలిగింది చేయండి. ఎవరి మీద ఆశ పెట్టుకోకండి. – స్వామి వివేకానంద.
మిమ్మల్ని శారీరకంగా, మేధోపరంగా, ఆధ్యాత్మికంగా, బలహీనపరిచే దేన్నైనా విషంతో సమానంగా భావించి తిరస్కరించండి. – స్వామి వివేకానంద.
ఒక ఆలోచనను స్వీకరించండి. దాని గురించే ఆలోచించండి, దాని గురించే కలగనండి. మీ నరనరాల్లో ఆ ఆలోచనని జీర్ణించుకుపోనీయండి. మిగతా ఆలోచనలను పక్కన పెట్టండి. ఇలా చేస్తే విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది. – స్వామి వివేకానంద.
ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం. – స్వామి వివేకానంద
కెరటం నాకు ఆదర్శం. లేచి పెడుతున్నందుకు కాదు. పడి లేచినందుకు. – స్వామి వివేకానంద
నీ వెనుక ఏముంది నీ ముందు ఏముంది అనేది నీకు అనవసరం నీలో ఏముంది అనేది ముఖ్యం. – స్వామి వివేకానంద
మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనని తిరస్కరించండి. – స్వామి వివేకానంద
ఒక్క క్షణం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే. ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. – స్వామి వివేకానంద
జీవితములో ధనమూ కోల్పోతే కొంత కోల్పోయినట్టు.. కానీ వ్యక్తిత్వమూ కోల్పోతే సర్వస్వమూ కోల్పోయినట్టే. – స్వామి వివేకానంద
ఏ పరిస్థితుల్లో ఉన్న నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగాల్సిన పనులు అవే జరుగుతాయి. – స్వామి వివేకానంద
చావు బతుకులు ఎక్కడో లేవు… ధైర్యంలోనే బ్రతుకుంది.. భయంలోనే చావు ఉంది. – స్వామి వివేకానంద
పోరాటంలోనైనా, మృత్యువులోనైనా మీ శ్యక్తినే నమ్ముకోండి. ప్రపంచములో పాపం అనేది ఉంటే… అది మీ బలహీనత మాత్రమే. – స్వామి వివేకానంద
అపారమైన విశ్వసాం. అనంతమైన శక్తి.. ఇవే విజయసాధనకి మార్గాలు. – స్వామి వివేకానంద
పసిబిడ్డను తల్లి ముద్దాడుతుంది. ప్రేమ పూరితమైన ఆ ముద్దులోనే భగవంతుడు ఉన్నాడు. – స్వామి వివేకానంద
కష్టాల్లో ఉన్నప్పుడే మనసులోని శక్తి యుక్తులు బయటపడతాయి. అద్భుతాలు సాధించడానికి మూలం ధృడ నమ్మకం. – స్వామి వివేకానంద
స్వామీ వివేకానంద గురించి
• స్వామీ వివేకానంద (జనవరి 12, 1863 – జూలై 4, 1902) ప్రసిద్ధ హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. ఆయన రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు.
• ఆయన హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలో ఒక ప్రముఖ వ్యక్తి. ఆయన రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.
• ఆయన తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండు లలో యోగ, వేదాంత శాస్త్రములను పరిచయం చేశారు. పాశ్చాత్య దేశాలలో అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి ఆయన.
• ఆయన భారత దేశ తత్త్వమును షికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనం (పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్)లో 1893లో ప్రపంచానికి చాటిచెప్పారు.
• స్వామీ వివేకానంద రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశారు. ఆయన ముప్పై తొమ్మిది ఏళ్ళ వయసులో 4 జూలై 1902న పశ్చిమబెంగాల్ లోని బెలూర్ లో మరణించారు.